అక్కినేని అఖిల్( Akkineni Akhil ) ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈయన జైనాబ్( Zainab ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం( Engagement ) జరిగిన సంగతి తెలిసిందే.త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
ఇక నిశ్చితార్థం తర్వాత అఖిల్ తన మొదటి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రేయసితో కలిసి చాలా స్పెషల్ గా జరుపుకున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అఖిల్ తన కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి బీచ్ సైడ్‌లో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు ఈ ఫోటోలు తన కాబోయే భార్యను గట్టిగా హగ్ చేసుకుని ఉన్నారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసిన అఖిల్ నా సర్వస్వం అంటూ లవ్ సింబల్ తో ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.బీచ్ సైడ్‌లో వీరిద్దరూ ఒకేలా కాస్ట్యూమ్ ధరించి, ప్రేమలోమునిగి తేలుతున్నారు.
ఇటీవల కాలంలో వీరిద్దరూ తరచూ బహిరంగంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ తన పెళ్లి డేట్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు అయితే వీరి పెళ్లికి మరికాస్త సమయం ఉందని తెలుస్తుంది.గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి అఖిల్ ఎక్కడ కూడా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తరువాత లెనిన్( Lenin ) అనే టైటిల్‌తో ఓ కొత్త ప్రయోగాత్మక సినిమా కోసం రెడీ అవుతున్నారు.అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతున్నారని తెలుస్తోంది.