టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పలు సినిమాలలో నటించిన వారిలో నటి పూనమ్ ( Poonam ) ఒకరు.ఈమె సినిమాలలో నటించి ఫేమస్ అవడం కంటే కూడా వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు.
తనకు ఇండస్ట్రీలో కొంతమంది అన్యాయం చేశారు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ని ఉద్దేశించి తరచూ సోషల్ మీడియా వేదికగా పూనమ్ చేసే పోస్టులు సంచలనం గా మారుతూ ఉంటాయి.ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఈమె రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా కర్మ సిద్ధాంతం అంటూ పూనమ్ మరొక పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని స్పష్టమవుతుంది.ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ.కర్మ ఎవరిని వదిలిపెట్టదు.కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కాసేపటికి చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది… పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు అంటూ ఘాటుగా స్పందించారు.

ఇక ఈమె పోస్ట్ చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ కొడుకుకు జరిగిన ప్రమాదం గురించి స్పందించి పోస్ట్ చేశారని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ( Mark Shankar ) ఇటీవల తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.ఈ చిన్నారి చేతులు కాళ్లు గాయాలు అయ్యాయని అనంతరం ఊపిరితిత్తులలోకి పోగ వెళ్లడంతో అస్వస్థతకు గురి అయ్యారని వెల్లడించారు.
ఈ విధంగా ఈ చిన్నారి అగ్ని ప్రమాదానికి గురయ్యారని విషయం తెలియడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ చిన్నారి క్షేమంగా ఉండాలి అంటూ పోస్టులు చేశారు ఇలాంటి తరుణంలోనే ఈమె కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు అంటూ పోస్ట్ చేయడంతో అది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని స్పష్టమవుతుంది.