సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు చాలా అద్భుతాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకుంటున్నారు.అయితే ఆ యంగ్ డైరక్టర్ లలో కార్తీక్ ఘట్టమనేని( Karthik Gattamneni ) ఒకరు.
ఈయన ఇంతకుముందు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య( Surya vs Surya ) అనే సినిమా తీశారు ప్రస్తుతం రవితేజతో ఈగల్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తున్న అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ లో బాలీవుడ్ కి చెందిన సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ చాలా సినిమాల్లో విలన్ గా చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటున్నాడు.
ఆది పురుష్( Adipurush ) సినిమాలో రావణాసురుడు క్యారెక్టర్ చేసిన ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబో లో వస్తున్న దేవర సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈయన ఈ సినిమా తో పాటు గా ఇప్పుడు ఈగల్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తూ విలన్ క్యారెక్టర్లు పోషించడంలో తనకు తానే సాటి అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని కార్తీక్ ఘట్టమనేని ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈయన ఇంతకుముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు.
దాంతో ఈ సినిమాతో డైరెక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే తనకి నెక్స్ట్ మంచి అవకాశాలు ఉంటాయి అనేది తెలుస్తుంది.ఇక సూర్య వర్సెస్ సూర్య కంటే ముందే ఈయన కొన్ని సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా కూడా చేశాడు.
కార్తికేయ ఘట్టమనేని కార్తికేయ,ధమాకా లాంటి సినిమాలకి కూడా తనే సినిమాటోగ్రాఫర్ గా చేశాడు…