అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ను ఇరుదేశాల ప్రధానులు వీక్షించారు.ప్రధాని మోడీ టాస్ వేసి మ్యాచ్ కు ఆరంభం పలికారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకొని బరిలో దిగింది.అయితే భారత్ చెత్త ఫీల్డింగ్ చేస్తూ, ఆస్ట్రేలియాకు అవకాశాలు ఇస్తూ ఉండడంతో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా సాగుతొంది.
మొదటి ఆరు ఓవర్లలో చేతికి వచ్చిన రెండు అవకాశాలను భారత్ చేజేతుల వదులుకుంది.ఉమేష్ యాదవ్ వేసిన బౌలింగ్లో ట్రావిస్ హెడ్ సింపుల్ క్యాచ్ ఇస్తే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ మిస్ చేశాడు.
తరువాత పది పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా ను రన్ అవుట్ చేసే అవకాశం వస్తే శుబ్ మన్ గీల్ మిస్ చేయడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది.ఇక ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 7ఫోర్లతో 32 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ఆస్ట్రేలియా 61 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది.తర్వాత లబుషేన్ 20 బంతుల్లో మూడు పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవడంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.
తరువాత రోహిత్ బౌలర్లను మార్చిన ఫలితం లేకుండా పోయింది.
పది పరుగుల వద్ద అవుట్ కావాల్సిన ఖవాజా 146 బంతులలో ఆప్ సెంచరీ చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు.ఇక మూడో టెస్టులో విశ్రాంతి తీసుకున్న మహమ్మద్ షమీకి పది రోజుల గ్యాప్ ఉండడంతో మొదటి బంతికే భారీ వైడ్ ఇచ్చి ఓవర్ కు 10 పరుగులు ఇచ్చేశాడు.మొత్తానికి ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్మిత్ సారథ్యంలో 74 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి, భారత బౌలర్లను చిత్తు చేస్తోంది.
ఇక రోహిత్ సేన త్వరగా వికెట్లు తీయలేకపోతే ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది.