మామూలుగా ఎవరైనా ఓవర్ చేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే జనాలు వారిని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు.వాళ్ళు మామూలు వ్యక్తులైన కానీ సెలబ్రిటీలు అయినా కానీ.
ఓవర్ గా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు.ఇక ఈమధ్య సెలబ్రిటీలలో కొంతమంది ఆర్టిస్టులు ప్రతిదానికి చాలా ఓవర్ అయిపోతూ జనాలతో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
దీంతో అనవసరంగా వాళ్ళు బుక్ అవుతున్నారు.అయితే తాజాగా దివి కూడా అలాగే ట్రోల్స్ కి గురవుతుంది.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
రియాలిటీ షో బిగ్ బాస్ షోతో అందరి కంటిలో పడిన బ్యూటీ దివి.
అలా అప్పటినుంచి ఈ బ్యూటీ ఏదో ఒక విధంగా తన పరిచయాన్ని పెంచుకుంటూ వచ్చింది.అలా వెండితెరపై అవకాశాలు కూడా అందుకుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.తొలిసారిగా ఈ బ్యూటీ వెండితెరపై పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.
అలా హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.ఇక ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.
పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.
గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో అవకాశం అందుకోగా ఈ సినిమాలో తన పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది.మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.
పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె.తన ఇన్ స్టా లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను ఏదో జర్నీ చేస్తున్నట్లు కనిపించగా తన కళ్ళజోడు కిందికి దింపుతూ బూమరింగ్ వీడియో చేస్తూ కనిపించింది.
దాంతో కన్నీరు పెట్టుకున్న ఎమోజిని పంచుకుంది.అయితే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
దీంతో అది చూసి నెటిజెన్స్ ఇప్పుడు నువ్వు ఏడిస్తే మేము వచ్చే ఊరుకోబెట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది.
ఈమె బాయ్ ఫ్రెండ్ ఈమెను వదిలేసి వెళ్లిపోయాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక దివి ప్రస్తుతం స్పెషల్ సాంగ్ లలో మాత్రమే బిజీగా ఉంది.