ప్రస్తుతం చాలామంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే చిరుధాన్యాలను పండించాలని, తద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందిని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ నేపధ్యంలో వారు.రైతులు నల్ల గోధుమలను పండించేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ రకం గోధుమల్లో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.నల్ల గోధుమ రకం (నబీ ఎంజీ)లో ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సాధారణ గోధుమ రకాల కంటే ఎక్కువగా ఉన్నాయని సర్దార్ వల్లభాయ్ పటేల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ ఎస్ సెంగార్ తెలిపారు.
దీని విత్తనం క్వింటాల్‌కు ఆరు నుంచి తొమ్మిది వేల రూపాయలు.
సాధారణంగా ఇది నవంబర్‌లో విత్తుతారు.
డిసెంబర్‌లో విత్తేటప్పుడు హెక్టారుకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు, జనవరిలో విత్తేటప్పుడు హెక్టారుకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లు గోధుమ దిగుబడి వస్తుంది.డాక్టర్ సెంగార్ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ గోధుమల కంటే బ్లాక్ గోధుమలో ఎక్కువ యాంటీ గ్లూకోజ్ మూలకాలు కూడా ఉన్నాయి.
ఇది షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది.రక్త ప్రసరణను నార్మల్‌గా ఉంచుతుంది.ట్రైగ్లిజరైడ్ మూలకాల కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉంటుంది.