హీరోయిన్ల మాదిరి పాలరాతి శిల్పం లా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.అందుకోసమే ఖరీదైన క్రీములు, సీరమ్ లు, ఫేస్ మాస్కులు ఇలా మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులెన్నెన్నో వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కనపెడితే.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమిడీ మాత్రం మిమ్మల్ని అందంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.
మరి ఈ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హిట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తరువాత ఒక బౌల్ ను తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, వన్ టేబుల్ ఫుల్ వేపాకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ పుదీనా ఆకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

చివరగా సరిపడా రైస్ వాటర్ లో కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రం గా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ న్యాచురల్ హోం రెమెడీ రోజుకు ఒకసారి ట్రై చేయడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.
చర్మంపై ఏమైనా మచ్చలు, మొటిమలు ఉంటే క్రమంగా తొలగిపోతాయి.అలాగే హీరోయిన్ల మాదిరి మీరు కూడా పాలరాతి శిల్పం లా అందంగా మెరుస్తారు.
కాబట్టి తప్పకుండా ఈ హోం రెమెడీని ట్రై చేయండి.మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి.