గేమ్ ఛేంజర్ మూవీకి ఆ రెండు సీన్స్ హైలెట్ కానున్నాయా.. ఫ్యాన్స్ కు పూనకాలే!

2025 సంవత్సరంలో విడుదలవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.రామ్ చరణ్( Ram Charan ) సినీ కెరీర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకొన్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.

 Ram Charan Game Changer Movie Highlight Scenes Details, Ram Charan , Game Change-TeluguStop.com

ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా శంకర్( Shankar ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

ఈ సినిమా ఏకంగా 2 గంటల 50 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ కానుంది.చరణ్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని కోరుకుంటారో అదే విధంగా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.ఈ రెండు సన్నివేశాలకు ఫ్యాన్స్ కు పూనకాలే అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Ramcharan, Tol

గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుండగా గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించడం ఈ హీరోయిన్ కు సైతం ఎంతో కీలకం అని చెప్పవచ్చు.గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Ramcharan, Tol

గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు బ్యానర్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.దిల్ రాజు నిర్మించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై హిట్టైన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.అందువల్ల గేమ్ ఛేంజర్ విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube