గేమ్ ఛేంజర్ మూవీకి ఆ రెండు సీన్స్ హైలెట్ కానున్నాయా.. ఫ్యాన్స్ కు పూనకాలే!
TeluguStop.com
2025 సంవత్సరంలో విడుదలవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.
రామ్ చరణ్( Ram Charan ) సినీ కెరీర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకొన్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.
ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా శంకర్( Shankar ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
ఈ సినిమా ఏకంగా 2 గంటల 50 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ కానుంది.
చరణ్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని కోరుకుంటారో అదే విధంగా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.
ఈ రెండు సన్నివేశాలకు ఫ్యాన్స్ కు పూనకాలే అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/" /
గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుండగా గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించడం ఈ హీరోయిన్ కు సైతం ఎంతో కీలకం అని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.
గేమ్ ఛేంజర్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
"""/" /
గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు బ్యానర్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.
దిల్ రాజు నిర్మించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై హిట్టైన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.
అందువల్ల గేమ్ ఛేంజర్ విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.
చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?