ఎప్పుడూ కూడా ఎవరితో గొడవ పడకుండా తన పనేదో చూసుకుని వెళ్ళే వాణిశ్రీ, నటిగానే కాకుండా దర్శకురాలిగా సత్తా చాటిన విజయనిర్మలల మధ్య చాలా ఏళ్లుగా ఈగో వార్ నడిచింది.అది కూడా ఒక స్కిట్ విషయంలో.ఆ స్కిట్ లో వాణిశ్రీ, రమాప్రభ కలిసి నటించారు.స్కిట్ లో భాగంగా, రమాప్రభ, వాణిశ్రీని “ఏం లేటయ్యిందే” అని అడిగితే, దానికి వాణిశ్రీ “తాను 20 ఏళ్ల నాటి దేవదాసు సినిమా చూసి వస్తున్నానని, ఇప్పటికీ ఆ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుందని, అదే కృష్ణ, విజయనిర్మల నటించిన దేవదాసు సినిమా ఈగలు తోలుతుందని” సెటైరికల్ గా సమాధానం చెప్పారు.
ఆ మాటలు విన్న ఆడియన్స్ తెగ నవ్వుకున్నారు.ఇలా ఎక్కడ స్కిట్ వేసినా విజయనిర్మల, కృష్ణ నటించిన దేవదాసు సినిమా మీదే సెటైర్లు వేసేవారు వాణిశ్రీ.స్కిట్ లో భాగంగా అయితే అంతలా గుచ్చి గుచ్చి కామెంట్స్ చేయడం ఏంటని విజయనిర్మల వాణిశ్రీ మీద కోపం పెంచుకున్నారు.“మా సినిమా మీద కామెంట్స్ చేయవలసిన అవసరం ఏముంది? అధిక ప్రసంగి” అంటూ నిప్పులు చెరిగారు.
నిజానికి అక్కినేని, సావిత్రి నటించిన దేవదాసు ఒక క్లాసిక్ మూవీ.ఈ సినిమాని ఎంతో మంది ఎన్నో సార్లు రీమేక్ చేశారు.అలాంటిది తన భర్త కృష్ణతో కలిసి తానే స్వయంగా దర్శకురాలిగా మారి రీమేక్ చేశారు.శరత్ చంద్ర అనే బెంగాల్ రచయిత రాసిన కథ చదివి ఇంప్రెస్ అయిన విజయనిర్మల ఈ సినిమాని తెరకెక్కించారు.
అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.అంత మాత్రాన ఈమెకు చేతకాలేదు అన్నట్టు వాణిశ్రీ వ్యవహరించడాన్ని విజయనిర్మల తప్పుబట్టారు.
నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన, విజయనిర్మల దర్శకురాలిగా మారి 44 సినిమాలను తెరకెక్కించారు.ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

అలాంటి విజయనిర్మల మీద వాణిశ్రీ కామెంట్స్ చేయడం చాలా బాధపెట్టింది.అందుకే వాణిశ్రీ మీద చాలా సందర్భాల్లో విజయనిర్మల పగ తీర్చుకునేందుకు ప్రయత్నించారు.ఒక సందర్భంలో నటీనటులు ఒక బస్ లో వెళ్లాల్సివస్తే ఆ బస్ లో వాణిశ్రీ ఉన్నారన్న కారణంగా విజయనిర్మల ఆ బస్ ఎక్కడం మానేశారు.అలా మొదలైన వీరి గొడవ కొన్నేళ్ళ పాటు సాగుతూనే ఉంది.
మద్రాస్ మా యూనియన్ లో వాణిశ్రీ మీద కంప్లైంట్ చేసి బ్యాన్ విధించేలా చాలా ప్రయత్నాలు చేశారు.ఈ విషయం వాణిశ్రీకి తెలియడంతో కృష్ణ, విజయనిర్మలల మీద కోపం పెంచుకున్నారు.
ఈ కారణంగానే కృష్ణతో అయిష్టంగానే సినిమాల్లో నటించేవారు వాణిశ్రీ అయితే ఈ ఈగో వార్ తారా స్థాయికి చేరుకోవడంతో సినీ పెద్దలు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.కానీ విజయనిర్మల ఒప్పుకోలేదు.
కృష్ణతో కూడా వాణిశ్రీ హీరోయిన్ గా ఉంటే సినిమాలు చేయనని చెప్పించడంతో వాణిశ్రీకి రావాల్సిన అవకాశాలు పోయాయి.

ఈ గొడవ జరిగిన 15 ఏళ్లకి ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన “రావుగారింట్లో రౌడీ” అనే సినిమాలో కృష్ణ రౌడీగా నటించాల్సి ఉంది.కృష్ణ కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ మొదలైంది.ఈ విషయం తెలిసి విజయనిర్మల, షూటింగ్ స్పాట్ కి వచ్చి గొడవ చేసి మరీ కృష్ణను అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు.
దీంతో కృష్ణ చేయాల్సిన పాత్రను సుమన్ చేశారు.అలా విజయనిర్మల, వాణిశ్రీ పట్ల పంతంగా ఉండేవారు. వాణిశ్రీ చేసిన చిన్న పొరపాటు చాలా ఏళ్ళు వెంటాడుతూనే ఉంది.ఆమె స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ వచ్చారు.
ఆ తర్వాత వయసైపోవడం, వంట్లో పట్టు తగ్గిపోవడం వల్ల పట్టుదల తగ్గింది.ఒకవేళ ఉన్నా ఏమీ చేసుకోలేరు కదా.ఇండస్ట్రీలో ఈగో వార్ అనేది హీరోలకే కాదు, హీరోయిన్స్ కి కూడా ఉంటుందని ఈ ఇద్దరూ ప్రూవ్ చేశారు.