నంది లేని శివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

సాధారణంగా మన దేశంలో ఏ శివాలయానికి వెళ్ళిన మనకు శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.

శివాలయానికి వెళ్ళిన వారు నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

కానీ శివలింగానికి ఎదురుగా నంది లేకుండా ఉన్న శివాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ విధంగా నంది లేకుండా ఉన్న శివ లింగం కాశీ విశ్వేశ్వర ఆలయం అని చెప్పవచ్చు.

దేశంలో ఉన్న శివాలయాలలో అన్నింటికీ భిన్నంగా ఇక్కడ ఉన్న శివాలయంలో శివునికి ఎదురుగా నందిని ప్రతిష్టించ లేదు.

ఆ విధంగా శివ లింగం ముందు నంది ప్రతిష్టించకపోవడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం భారతదేశం పై దండెత్తిన ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్నింటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఆ విధంగా మన దేశంలో ప్రముఖ దేవాలయాల అన్నింటిని ధ్వంసం చేస్తూ చివరగా కాశీ విశ్వేశ్వర ఆలయం పై తన సైన్యంతో దండెత్తి వచ్చారు.

ఈ విషయాన్ని గ్రహించిన ఆలయ ప్రధాన అర్చకుడు శివాలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేటిలో పడేసారు.

ఔరంగజేబు అతని సైన్యం దేవాలయంలో సగం శిథిలాలన్నింటిని కూల్చివేశారు.కానీ ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని కూల్చకుండా అలాగే వదిలి వెళ్లారు.

"""/" / ఔరంగజేబు అతని సైన్యం వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు కోనేరులో పడేసిన శివలింగాన్ని కోసం ఎంతో ప్రయత్నించారు.

అయితే ఆ శివలింగం కోనేరులో కనిపించకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తయారు చేయించి కొత్తగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్టించారు.

అయితే ఈ దేవాలయంలో శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు దేవాలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శించుకుంటారు.

అంతేకాకుండా కోనేరులో శివలింగం ఉందని భావించే భక్తులు పొద్దు పొద్దున ఆ కోనేరుకు పూజలు నిర్వహిస్తుంటారు.

అంతేకాకుండా ఆ కోనేటిలో ఉన్న నీటిని మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు.దేశంలో ఉన్న శివాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే శివలింగం ఎదురుగా నంది ఉండదు.

ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. కొత్త ఆలోచనతో చేపలను ఎంత సులువుగా పట్టేస్తున్నారో