ఆ వయసు చిన్నారులకు మాస్క్ అవ‌స‌రం లేదంటున్న‌ డబ్ల్యూహెచ్ఓ!

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్‌.కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌కు చాప కింద నీరులా విస్త‌రించింది.

 Who Issues New Guidelines For Children Wearing Masks! Who, New Guidelines, Child-TeluguStop.com

మొద‌ట క‌రోనాను లెక్క చేయ‌ని ప్ర‌జ‌లు.ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారి పేరు వింటేనే వ‌ణికిపోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ క‌రోనాను అంతం చేసే వ్యాక్సిన్‌గాని, అదుపు చేసే ముందుగాని అందుబాటులో లేదు.

ఈ క్రమంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు ఊహించ‌ని విధంగా పెరిగిపోతున్నాయి.

ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే.ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అయిపోయింది.

అయితే మాస్కు ఎవ‌రికి అవ‌స‌రం? ఎవ‌రికి అవ‌స‌రం లేదు? అన్న‌దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Telugu Childrens, Coronavirus, Covid, Latest, Masks-

డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్ర‌కారం.12 ఏళ్లు దాటిన పిల్లలు సైతం పెద్దల మాదిరిగానే మాస్కులు త‌ప్ప‌కుండా ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.అయితే 5 ఏళ్ల‌లోపు పిల్లల‌కు మాస్క్ అవ‌స‌రం లేద‌ని.

వారు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది.ఎందుకంటే.

వారికి క‌రోనా సోకి అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని స్ప‌ష్టం చేసింది.

అలాగే 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న పిల్ల‌లు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఖ‌చ్చితంగా మాస్కు ధ‌రించాల‌ని తెలిపింది.

ఇక ఆట‌లు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని.కానీ, భౌతిక దూరం పాటించాల‌ని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube