యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడం సంతోషం కలిగించినా.
ఈ హిట్ లో మరో స్టార్ హీరో కూడా భాగం ఉండడం వల్ల నందమూరి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతోషం పొందలేదు.దీంతో ఈయన తర్వాత సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో తన 30వ సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.కానీ ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న క్రమంలో ‘NTR30‘ నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోయినా రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.ఈ సినిమాలో ఒక కీలక యాక్షన్ ఎపిసోడ్ కోసం కొరటాల భారీ సెట్ వేయిస్తున్నాడట.ఇంటర్వెల్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ మునుపెన్నడూ చూడని రేంజ్ లో ఉండనుందట.
ముందుగా కొరటాల ఈ యాక్షన్ సన్నివేశం ప్లేస్ లో సముద్రంలో జరిగే ఒక భారీ ఫైట్ అనుకున్నాడట.
అయితే ఈ ఫైట్ ప్లేస్ లో తాజాగా కొరటాల ఈ యాక్షన్ సీక్వెన్స్ ను యాడ్ చేసినట్టు టాక్.అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిట్ నెస్ లో భారీ మార్పులు చేస్తున్నాడు.ఏకంగా 9 కేజీల బరువు తగ్గనున్నాడు.
ఇక ఈ సినిమా ఈ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని వార్తలు వచ్చినా.కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మళ్ళీ ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది.