సోషల్ మీడియా ప్రపంచాన్ని చిన్నదిగా చేసిందని చెప్పుకోవచ్చు.ఒకప్పుడు ఇతర దేశాల విషయాలు ఏమీ తెలియకపోయేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది.
మారుమూలచోట పాపులర్ అయిన పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాకుతున్నాయి.ఇక ఇతర దేశస్థుల సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలామందికి తెలుస్తున్నాయి.
ఇక మన దేశ సంస్కృతులు సాంప్రదాయాలు పాటించడానికి, సంప్రదాయ వస్త్రాలను( Traditional Clothes ) ధరించడానికి చాలామంది తక్కువ చూపుతున్నారు.

మనదేశ పంచ కట్టు కట్టుకుంటూ భారతీయులతో కనెక్ట్ అవుతున్నారు.దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన బే యూన్-సూ కూడా మన సంస్కృతులు, సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్నాడు.అతను తన కొత్త వీడియో ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ భారతీయ అభిమానులను ఆకట్టుకున్నాడు.
వీడియోలో, అతను తన స్నేహితుడి తల్లిదండ్రులు తిరుపతి( Tirupati ) నుంచి పంపిన సాంప్రదాయ సౌత్ ఇండియన్ ధోతీ( South Indian Dhoti ) ధరించాడు.తనకు భారతీయ ఫ్యాషన్ అంటే చాలా ఇష్టమని, దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు.
ఆశీస్సులు అందించాలని లార్డ్ బాలాజీని కూడా కోరాడు.

మాములుగా నడుము చుట్టూ బంగారు అంచుతో చుట్టబడిన తెల్లటి వస్త్రాన్ని ధోతీ అని పిలుస్తారు.ఈ సౌత్ కొరియన్ దీనిని ధరించడంతోపాటు సాధారణ చొక్కా, భుజాలపై రంగురంగుల కండువాను కూడా ధరించాడు, దీనిని దుపట్టా( Dupatta ) అని పిలుస్తారు.ప్రత్యేక సందర్భాలలో, పండుగలలో దక్షిణ భారతదేశంలో పురుషులకు ఇది సాధారణ దుస్తులు.ఈ వీడియో వైరల్గా మారింది.1.8 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.చాలా మంది అతని వీడియోపై కామెంట్లు మరియు అతని లుక్ను ప్రశంసించారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







