చాలామంది తమ పొట్ట లావుగా ఉందని ఎంతగానో వర్రీ అయిపోతుంటారు.ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ కారణంగా పొట్ట లావుగా మారుతుంటుంది.
అలాగే పురుషుల్లో గంటలు తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.అంతేకాదు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం తదితర కారణాల వల్ల సైతం బాన పొట్ట ఏర్పడుతుంటుంది.
అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే నెల రోజుల్లోనే బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అర కట్ట కొత్తిమీర ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఈ కొత్తిమీర వాటర్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట నాజుగ్గా మారుతుంది.అంతేకాదండోయ్ కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు కొత్తిమీర వాటర్ సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.
మధుమేహం ఉన్నవారు కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

అలాగే కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల నొప్పులు, మౌత్ అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కొత్తిమీర వాటర్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, అజీర్తి తదితర జీర్ణ సంబంధిత సమస్యలను సైతం కొత్తిమీర వాటర్ తో దూరం చేసుకోవచ్చు.







