ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.54
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.11 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
వృషభం:
ఈరోజు మీకు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.స్థలం కొనుగోలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో తీరికలేని సమయం గడపడం వలన విశ్రాంతి దొరకదు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ నూతన పరిచయాలు ఏర్పడతాయి.
సింహం:
ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు పని చేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులా:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందే అవకాశం ఉంది.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
వృశ్చికం:
ఈరోజు మీరు బంధువుల నుండి శుభవార్త వింటారు.మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ధనస్సు:
ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు జాగ్రత్తగా ఉండాలి.మీరు పని చేసే చోట సహాయం అందుతుంది.
మకరం:
ఈరోజు మీకు ఇతరుల నుండి సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.మీ ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు ప్రముఖ వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాల్లో అనుకూలంగా ఉంది.మీరు పని చేస్తే చోట ఇతరుల నుండి వాదనలు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
TELUGU BHAKTHI