సాధారణంగా కొందరి పురుషుల్లో జుట్టు( Hair ) చాలా పల్చగా ఉంటుంది.అధిక హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.
ఈ రెండిటికీ చెక్ పెట్టి జుట్టును దట్టంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా చిన్న ఉల్లిపాయ( onion ) ని తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు( garlic ) కూడా తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మరియు వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee powder )వేసి మరిగించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మరిగిస్తే మన హెయిర్ టానిక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె ( Mustard oil )వేసి బాగా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.జుట్టు ఎదుగుదలకు చక్కని పోషణ అందుతుంది.కురులు దట్టంగా పెరుగుతాయి.పురుషులు ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.బట్టతలకు దూరంగా ఉండవచ్చు.మరియు ఈ టానిక్ చుండ్రు నివారణకు కూడా చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.