టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ( Adah Sharma ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.కేరళకు చెందిన ఈ బ్యూటీ తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
తన నటనతో తనకంటూ ఒక గుర్తింపు కూడా సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.
ఈమె తొలిసారిగా బాలీవుడ్ లో అడుగు పెట్టింది.కెరీర్ మొదట్లో వరుసగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.2014లో హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో తన పాత్రతో తన అందంతో ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.
అంతేకాకుండా ఈ సినిమా తనకు మంచి గుర్తింపు కూడా తెచ్చి పెట్టింది.

ఇక ఆ తర్వాత నటించిన సినిమాలలో అంత సక్సెస్ కాలేకపోయింది.ఇక కొన్నిసార్లు అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్ గా కూడా చేయాల్సి వచ్చింది.అలా ఈమెకు ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రావడం లేదు.
సెకండ్ హీరోయిన్ గా నటించిన కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడ, తమిళ భాషలో కూడా నటించింది ఆదాశర్మ.
ప్రస్తుతం తెలుగులో కాకుండా ఇతర భాషలలో బాగా బిజీగా ఉంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
చాలా వరకు తన సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులు చూస్తే కాస్త భయంకరంగానే ఉంటాయి.

చాలావరకు ఆమె దెయ్యాల లాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.మూగజీవులతో బాగా సమయం గడుపుతూ ఉంటుంది.ఇక తన డాన్స్ స్టెప్పులతో మాత్రం బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.
అలా సోషల్ మీడియా( Social media )లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె వేసే డ్రస్సులు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
ఎందుకంటే తన డ్రెస్సులు అలా ఉంటాయి కాబట్టి.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆదాశర్మ.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పరచుకోగా ఆ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.
అందులో తన చేతులకు, కాళ్లకు దద్దుర్లు లాగా గాయాలు అయినట్లు అనిపించాయి.ఇక దానికి కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది ఆదా శర్మ.
ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ తను త్వరగా రికవరీ కావాలి అని కోరుకుంటున్నారు.మరి కొంతమంది చాలా జాగ్రత్తలు చెబుతున్నారు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తను రికవరీ అయ్యే వరకు సినిమాలకు దూరంగా ఉందని తెలిసింది.







