బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 3 ద్వారా అలీ రేజాకు కంటెస్టెంట్ గా మంచి పేరు వచ్చింది.ఆ షో వల్ల అలీ రేజాకు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.
అలీరేజా తాజాగా హ్యాపీ డేస్ షోకు హాజరై రవి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలో రవికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో అలీరేజా కూడా ఒకరు.
రవి, అషురెడ్డి యాంకర్లుగా గత కొన్ని వారాలుగా హ్యాపీడేస్ షో ప్రసారమవుతోంది.
పటాస్ స్థాయిలో కాకపోయినా ఈ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
అషురెడ్డి అలీరేజాతో రవి ఎప్పుడూ తప్పు చేయడు కదా అని అడగగా అలీరేజా రవికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని మొదట చెబుతారు.అలా చెప్పడంతో రవి సిగ్గు పడి అలీరేజా భుజంపై చెయ్యి వేయగా అలీరేజా అమ్మతోడు వేసి చెబుతున్నానని రవి అస్సలు బూతులు మాట్లాడడని చెబుతాడు.
అయితే అకస్మాత్తుగా అలీరేజా అలా చెప్పడంతో రవి ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నిస్తాడు.

రవి మందు తాగిన సమయంలో మాత్రమే బూతులు మాట్లాడతాడని అమ్మాయిలతో ఉన్న సమయంలో మాత్రమే మందు తాగుతాడని షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే అలీరేజా కావాలని ఆటపట్టించడానికే అలా చెప్పారు.గతంలో కూడా ఒక షోలో అలీరేజా రవి గురించి మాట్లాడుతూ రవికి శ్రీముఖికి మధ్య ఏం లేదని తమది ఫుల్ బుడ్డీతో మొదలై ఎక్కడికో వెళ్లిన స్నేహమని అలీ రేజా చెప్పుకొచ్చారు.

రవి ఫుల్ బాటిల్ మొత్తం తాగి రాత్రంతా మందు కోసం తిప్పుతాడని మళ్లీ బ్లాక్ లో మందు ఎక్కడ దొరుకుందో వెతుకుతాడని అలీ రేజా అన్నారు.రవి ఎంత తాగినా స్టాండర్డ్ గా ఉంటాడని అలీ రేజా అన్నారు.రవి ఎంతమందితో రిలేషన్ లో ఉన్నారంటే 5 మంది అని అలీరేజా చెప్పారు.