చిక్కుడు పంటకు తెగుళ్లు ఆశించకుండా చేపట్టవలసిన సంరక్షక చర్యలు..!

తీగజాతి కూరగాయలలో చిక్కుడు పంట( Beans Crop ) కూడా ఒకటి.ఈ చిక్కుడును సాధారణ పద్ధతిలో, పందిరి పద్ధతిలో సాగు చేస్తారు.

 Measures To Prevent Rust Pests Of Beans Crops Details, Rust Pests ,beans Crops,-TeluguStop.com

పందిరి పద్ధతిలో సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.పైగా పందిరి పద్ధతిలో సాగు చేస్తే ఆశించే చీడపీడలను, తెగులను( Pests ) సకాలంలో గుర్తించి పంటను సంరక్షించుకోవడానికి అవకాశాలు ఎక్కువ.

కాబట్టి చాలామంది రైతులు పందిరి పద్ధతిలో చిక్కుడు పంటను సాగు చేస్తున్నారు.

Telugu Agriculture, Beans Crop, Beans Crops, Beans, Beans Farmers, Cluster Beans

ఈ చిక్కుడు పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో తుప్పు తెగులు కీలకపాత్ర పోషిస్తాయి.ఈ తుప్పు తెగులు ఒక ఫంగస్( Fungus ) వల్ల పంటకు సోకుతాయి.మట్టిలో ఉండే ఇతర మొక్కల అవశేషాల్లో ఈ ఫంగస్ జీవించి ఉంటుంది.

మొక్క కణజాలాన్ని తిని జీవిస్తుంది.ఈ ఫంగస్ మొక్కల సహాయం లేకుండా జీవించలేదు.

గాలి, నీరు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.చిక్కుడు మొక్క ఆకులపై గోధుమ రంగు నుండి పసుపు రంగు బుడిపెలు ఏర్పడి చిరిగిపోయినట్లు కనిపిస్తే.

ఆ మొక్కలకు తుప్పు తెగులు సోకినట్టే.ఈ తెగులు ముందుగా ఆకులను ఆశించి ఆ తర్వాత మొక్క కాండం, కాడలకు సోకుతుంది.

లేత మొక్కలకు తుప్పు తెగులు ఆశిస్తే మొక్కలు చనిపోతాయి.పెద్ద మొక్కలకు ఆశిస్తే మొక్కల ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.

Telugu Agriculture, Beans Crop, Beans Crops, Beans, Beans Farmers, Cluster Beans

చిక్కుడు పంటకు తుప్పు తెగులు ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకోవాలి.చిక్కుడు పంటలో అక్కడక్కడ మొక్కజొన్న విత్తనాలు( Seeds ) నాటుకోవాలి.పొలంలో కలుపు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.మొక్కల ఆకులపై ఎక్కువసేపు తేమ( Moisture ) లేకుండా చూసుకోవాలి.సేంద్రీయ పద్ధతిలో బాసిల్లస్ సబ్టిలిస్, అర్ధోరోబాక్టర్ లాంటి జీవ కీటక నాశనులను ఉపయోగించి ఈ తెగులు నియంత్రించవచ్చు.

రసాయన పద్ధతిలో త్రయాజోల్, స్ట్రోబిల్లురిన్ లాంటి రసాయనాలను ఉపయోగించి మొక్కలపై పిచికారి చేసి ఈ తెగులను నివారించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube