రోడ్డెక్కబోతున్న లోకేష్ .. వారిహి ఎక్కనున్న పవన్ ! ఎప్పుడంటే ? 

అర్ధాంతరంగా నిలిచిపోయిన నారా లోకేష్ ( Nara Lokesh )యువ గళం పాదయాత్ర మళ్ళీ మొదలు కాబోతోంది.టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు చేయడంతో లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 Lokesh Who Is Going To Hit The Road Pawan Who Is Going To Ride Warihi When ,-TeluguStop.com

పూర్తిగా చంద్రబాబు బెయిల్ ప్రయత్నాల్లోనే నిమగ్నమయ్యారు.ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న లోకేష్ వారాహి యాత్రను ( Varahi yathra )మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఈ యాత్రకు బ్రేకులు వేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో లోకేష్ అరెస్టు భయంతో పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యువ గళం పాదయాత్రను మొదలుపెట్టి జనాల్లోకి వెళ్లి చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ప్రజల్లో సానుభూతిని సంపాదించాలనే ప్రయత్నాల్లో లోకేష్ ఉండగా,  ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సైతం వారాహి యాత్రను మొదలు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Lokesh, Varahi Yathra, Ysrcp-Politics

 అక్టోబర్ 1 నుంచి అవనిగడ్డ నుంచి యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ వారాహి యాత్ర మొదలుపెట్టి మచిలీపట్నం,  పెడన,  కైకలూరు నియోజకవర్గ రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ఉమ్మడి కృష్ణాజిల్లా కీలక నాయకులతో టెలికాంఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు.

ఇక లోకేష్( Nara Lokesh ) కూడా యువ గళం పాదయాత్రను కూడా అప్పుడే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయిన  యాత్రను మళ్ళీ అక్కడ నుంచే ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.

గతంలో యువ గళం పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చిందని,  ఎక్కువగా ఈ యాత్రకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందని లోకేష్ భావిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Lokesh, Varahi Yathra, Ysrcp-Politics

ఒకవేళ ఏదైనా కేసులో తనను అరెస్ట్ చేస్తే అది జనం మధ్యనే జరిగితే తనకు , తమ పార్టీకి మరింత సానుభూతి వస్తుందని అంచనాలో లోకేష్ ఉన్నారట.టిడిపితో పొత్తు అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఆ తర్వాత సైలెంట్ అవడంతో అనేక విమర్శలు వస్తున్నాయి .ఈ నేపద్యంలో అక్టోబర్ 1 నుంచి వారాహి యాత్రను మొదలు పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు .దీంతో ఒకేసారి అటు లోకేష్ ఇటు పవన్ యాత్రలు ఏపీలో రాజకీయ సందడిని కలిగించనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube