సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రజనీకాంత్.
ఇప్పటికీ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా రజనీకాంత్ తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఈతరం ప్రేక్షకులకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఒక సినిమా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్.

ఇది ఇలా ఉంటే రజినీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్ ( Jailer ). ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఒక లీగల్ సమస్యలు చిక్కుకుంది.
ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా టైటిల్ తమదే అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు.
ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్( Kerala Film Chamber ) లో జైలర్ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు.అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించారు.
కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది.

ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని సక్కిర్ అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలోనే మిగతా భాషల్లో కుదరకపోయినా మలయాళ వరకు అయినా సరే రజినీకాంత్ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిందేనని దర్శకుడు సక్కిర్ మడతిల్( Sakkir Madathil ) పట్టుబడుతున్నారు.మరోవైపు మార్కెట్ పరంగా తమ చిత్రానికి ఎక్కడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించారు.
ఆగస్టు 2న హియరింగ్ ఉంది.ఆ రోజు ఈ వివాదంపై క్లారిటీ వస్తుంది
.