గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ నటి మీనా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతమైన పాత్రలో నటించిన మీనా హీరోయిన్ గా కూడా మంచిది సినిమాలలో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే మధ్యలో కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైన మీనా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఈ క్రమంలోనే వరుస తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న మీనాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది.

తాజాగా ఈమెకు యూఏఈ గోల్డెన్ వీసా వచ్చినట్టు తెలుస్తోంది.ఈ విధంగా గోల్డెన్ వీసా ను అందుకున్న వారు పది సంవత్సరాలపాటు ఆ దేశంలో వారసత్వాన్ని కలిగి ఉంటారు.

అయితే ఈ గోల్డెన్ వీసా అందరికీ రాదు కేవలం కొందరికి మాత్రమే ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు.మీనా కంటే ముందు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సంజయ్‌ దత్ , గోల్డెన్ వీసాను అందుకున్నారు.అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్, పార్తిబన్, త్రిషా, అమలాపాల్, కాజల్ అగర్వాల్ వంటి తదితర సెలబ్రిటీలు కూడా గోల్డెన్ వీసా దక్కించుకున్నారు.

ఇక మెగా కోడలు ఉపాసన కూడా ఈ జాబితాలో ఉన్నారు.తాజాగా గోల్డెన్ వీసా అందుకున్న మీనా.దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు