ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీది అధికారమో చెబుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేలు వెల్లడయ్యాయి.సర్వేల ఫలితాలను ఇప్పటికే చాలా సంస్థలు ప్రకటించినా ఆ సంస్థల్లో విశ్వసనీయత ఉన్న సంస్థలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
రవి ప్రకాష్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఏపీలో కూటమికి 111 ( 111 for alliance in AP)స్థానాల్లో విజయం దక్కుతుందని వైసీపీకి 63 స్థానాల్లో విజయం దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సర్వేలలో ప్రామాణికత ఎంత? అనే ప్రశ్నలకు మాత్రం రవిప్రకాష్ ( Raviprakash )సర్వే అంచనాలు తప్పయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2014లో టీడీపీ రుణమాఫీ ప్రకటించిన సమయంలోనే వైసీపీకి 67 స్థానాలు వచ్చాయి.గత ఐదేళ్ల జగన్ పాలన చాలామంది సీఎంలతో పోల్చి చూస్తే బెటర్ గా ఉంది.
అందువల్ల వైసీపీ సునాయాసంగానే 88 సీట్లలో విజయం సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆత్మసాక్షి ఆరో విడత సర్వేలో( Atmasakshi Sixth Phase Survey ) సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు రావడంతో రవిప్రకాష్ సర్వే తప్పని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సైతం రవిప్రకాష్ ప్రకటించిన ఫలితాలతో ఏకీభవించడం లేదు.రవిప్రకాష్ త్వరలో టీవీ రంగంలో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలే ఆయనపై ప్రజల్లో విశ్వసనీయత ఉందో లేదో తేల్చనున్నాయి.
రవిప్రకాష్ సర్వే ఫలితాల విషయంలో వైసీపీ నేతలు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో కూడా పలు సర్వేలు టీడీపీదే విజయమని ప్రచారం చేయగా ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు.ఏపీలో ఏ సర్వేను నమ్మాలో ఏ సర్వేను నమ్మకూడదో అర్థం కావడం లేదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.రవిప్రకాష్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు చెబుతుండగా ఆయన మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.