అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. దర్శనం, బుకింగ్ లపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం..

తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు దేవస్థానం బోర్డు వారు ఓ కీలక ప్రకటనను జారీ చేశారు.స్వామి దర్శనం అలాగే స్పాట్ బుకింగ్ లకు సంబంధించిన వివరాలకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటనలు చేసింది.

 Good News For The Devotees Of Ayyappa Swamy.the Temple Made An Important Announc-TeluguStop.com

రాబోయే మండల, మకర విలక్కు సీజన్ నుండి స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం(Travan Core Temple) తెలియజేసింది.దీని కారణం శబరిమలకు( Sabarimala) వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం బోర్డు నిర్ణయాన్ని తెలిపింది.

దేవస్థానం బోర్డు సంబంధించిన అధికార వెబ్సైట్ లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే వారికి దర్శనానికి అనుమతించ బోతున్నట్లు అధికారులు తెలియజేశారు.మే 4న జరిగిన దేవస్థానం బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు అధికారులు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో రోజుకు కేవలం 80000 మందిని వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఇందుకుగాను భక్తులు మూడు నెలలు ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్(Virtual queue booking) చేసుకోవచ్చని తెలియజేశారు.ఇదివరకు ఈ సదుపాయం కేవలం 10 రోజుల ముందు మాత్రమే ఉండేది.

ఇప్పుడు ఈ సదుపాయాన్ని మూడు నెలల ముందుకు దేవస్థానం బోర్డు వారు పెంచారు.గతేడాది అనుభవాలతో ఇలాంటి నిర్ణయాలను తీసుకుంది దేవస్థానం కార్యవర్గం.

మకర విలక్కు సమయంలో ఆన్లైన్ బుకింగ్ ను అనువదించాలా వద్దా అనే నిర్ణయంపై అతి త్వరలో మరో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బోర్డ్ అధికారులు తెలిపారు.అలాగే శబరిమల ఆలయంలో రోజువారి వేతనదారులుగా ఇతర రాష్ట్రాల వారిని నియామకంపై కూడా బోడు చర్చించింది.ఇంకా అయ్యప్ప స్వామి పూజకు అరలి పుష్పం వాడకంపై కూడా నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube