ప్రపంచంలో చాలామంది ఎక్కువగా ఉపయోగించే మెసేజ్ అప్లికేషన్ ఏది అంటే మొదటి సమాధానం వాట్సప్.వాట్సప్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది.
మొదటగా బీటా వర్షంలో టెస్టింగ్ చేసిన తర్వాత అందుకు సంబంధించి ఏవైనా పొరపాటు జరిగి ఉంటె దానిని పూర్తి రెక్టిఫై చేసి ఆ తర్వాత పూర్తి వర్షన్ అందరికీ అందిస్తుంది.ఇకపోతే తాజాగా పనిచేస్తున్న వాట్సాప్ ఇన్స్టంట్ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ యూజర్ అకౌంట్లకు మెసేజ్లు పంపించకుండా నిరోధించేందుకు కొత్త ఫీచర్ తో టెస్టింగ్ చేస్తోంది.
అతి త్వరలో ఈ యాప్ ఫ్యూచర్ అప్డేట్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది.ఇందుకోసం ఆండ్రాయిడ్ 2.24.10.5 అప్డేట్ కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటాను (WhatsApp Beta)అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.ఈ ఫీచర్ వాట్సప్ అకౌంట్ పరిమితి పై పని చేస్తుందని తెలుస్తోంది.
వాట్సాప్ యూజర్ అకౌంట్లలో మెసేజ్లు పంపకుండా నియంత్రించే ఫ్యూచర్ పై ఇది పనిచేస్తున్నట్లు స్క్రీన్ షాట్ ద్వారా తెలిసింది.ఒకవేళ వాట్సప్ మీ అకౌంట్ పై పరిమితి కానీ విధిస్తే ఉల్లంఘన కింద కొంత సమయం వరకు కొత్త చాటింగ్ చేయకూడదు.
మరోవైపు నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ చాటులు గ్రూపుల నుంచి వచ్చే మెసేజ్లను మాత్రం మనం స్వీకరించవచ్చు.అలాగే వాటికి రిప్లై కూడా ఇవ్వవచ్చు.
ఈ ఫీచర్ ముఖ్యంగా వాట్సాప్ స్పామ్ లేదా బల్క్ మెసేజ్ లేదా ఏదైనా సర్వీసులకు సంబంధించి నిబంధనలను ఉల్లగించే ఇతర కార్యకలాపాలను కంపెనీ గుర్తించడానికి ఆటోమేటిక్ టూల్స్ ను ఉపయోగించింది.వీటి ద్వారా మెసేజ్లు, కాల్స్ ను అలా అనవసర మెసేజ్లు పంపించేవారు యాక్సిస్ చేయలేరు.దీనికి కారణం వాట్సప్ ఉపయోగించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయం.