ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ( MP candidate Karumuri Sunil )కారుపై దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఆయన కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని సమాచారం.
రాత్రి జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్తుండగా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కారుపై దాడి జరిగింది.టీడీపీ క్యాడర్ చేసిన ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అయితే దీనిపై వైసీపీ నేతలు( YCP leaders ) తీవ్రంగా మండిపడుతున్నారు.ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఎన్నికల సమయం అని తెలిసి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆరోపించారు.తమ సహానాన్ని పరీక్షించవద్దని సూచించారు.







