Revanth Reddy : ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన..: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం నిప్పులు చెరిగారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఎజెండా లేకపోయినా స్పీకర్ నిర్ణయం మేరకు ఏదైనా చర్చించవచ్చని తెలిపారు.14 లక్షల ఎకరాల సాగు కోసం దివంగత నేత వైఎస్ఆర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు.తెలంగాణ వచ్చాక రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం( Kaleshwaram ) తీసుకొచ్చారన్నారు.

 Visiting Projects To Create Awareness Among Mlas Cm Revanth-TeluguStop.com

గత ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఏర్పాటు చేసిందన్న రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు( Medigadda project ) పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు.ఇసుక కదిలితే పిల్లర్లు కుంగాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు.బ్యారేజీని ఎవరూ చూడకుండా పోలీసులను కాపలాపెట్టారని మండిపడ్డారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన అని స్పష్టం చేశారు.హరీశ్ రావు, కడియం శ్రీహరి వంటి అనుభవం ఉన్నవారు వచ్చి చూడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube