Nani : నాని సినీ ఇండస్ట్రీకి ఇంత మంది డైరెక్టర్లను పరిచయం చేశాడా వారు ఎవరో తెలిస్తే..!

స్టార్ నాని చిన్న సినిమాల నుంచి పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు.బాల్యం నుంచే ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది.

 Nani Introduced Directors-TeluguStop.com

అంతేకాకుండా సినిమాలపై ఉన్న అభిరుచితో ఈ పరిశ్రమలో స్థిరపడాలనుకున్నారు.నాని( nani ) మొదట్లో దర్శకుడు కావాలనుకున్నారు.కానీ నటనలో అవకాశాలు రావడంతో నటుడిగా అడుగులు వేశారు.2008లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్ట చమ్మా’ సినిమాతో నాని హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.నాని హీరో ఎదిగే క్రమంలో ఎంతోమంది దర్శకులను అతడు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.

• సత్యం బెల్లంకొండ – స్నేహితుడు (2009)

నటుడు నాని 2009లో సత్యం బెల్లంకొండ( Satyam Bellamkonda ) దర్శకత్వంలో వచ్చిన “స్నేహితుడు”( snehitudu ) సినిమాతో తన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాలో నాని సరసన మాధవి లత నటించారు.ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించనప్పటికీ, సత్యం బెల్లంకొండకు ఒక కొత్త కంటెంట్‌పై ప్రయత్నించే అవకాశాన్ని ఇచ్చింది.

Telugu Gokul Krishna, Anjana Ali Khan, Bheemilikabaddi, Directors, Nandini Reddy

• తాతినేని సత్య – భీమిలి కబడ్డీ జట్టు (2010)

నటుడు నాని 2010లో తాతినేని సత్య( tatineni satya ) దర్శకత్వంలో వచ్చిన “భీమిలి కబడ్డీ జట్టు” సినిమాతో తన నటనకు మరింత మంచి పేరు తెచ్చుకున్నారు.ఈ సినిమాలో నానికి జంటగా శరణ్య మోహన్ నటించారు.ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ “వెన్నిల కాడి కుజు”కి రీమేక్‌గా వచ్చి కొన్ని సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడింది.

Telugu Gokul Krishna, Anjana Ali Khan, Bheemilikabaddi, Directors, Nandini Reddy

• నందిని రెడ్డి – అలా మొదలైంది (2011)

నందిని రెడ్డి( Nandini Reddy ) 2011లో రొమాంటిక్ కామెడీ చిత్రం అలా మొదలైందితో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించింది.నాని కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.ఈ చిత్రంతో నిత్యా మీనన్ తెలుగు సినిమా రంగ ప్రవేశం చేయగా, స్నేహ ఉల్లాల్ రెండవ కథానాయికగా నటించింది.

కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించింది నందిని రెడ్డి.

Telugu Gokul Krishna, Anjana Ali Khan, Bheemilikabaddi, Directors, Nandini Reddy

• అంజనా అలీ ఖాన్ – వెప్పం (2011)

నాని, నిత్యా మీనన్, కార్తీక్ కుమార్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో అంజనా అలీ ఖాన్( Anjana Ali Khan ) దర్శకత్వం వహించిన క్రైమ్ యాక్షన్ చిత్రం వేప్పం.ఇది నాని తమిళ తొలి చిత్రం.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

Telugu Gokul Krishna, Anjana Ali Khan, Bheemilikabaddi, Directors, Nandini Reddy

• ఎ.గోకుల్ కృష్ణ – ఆహా కళ్యాణం (2014)

ఎ.గోకుల్ కృష్ణ( A.Gokul Krishna ) 2014లో రొమాంటిక్ కామెడీ చిత్రం ఆహా కళ్యాణం చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్‌కి రీమేక్.

ఇది కమర్షియల్‌గా విజయం సాధించింది, ₹10 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద ₹22 కోట్లకు పైగా వసూలు చేసింది.నాని నాగ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల, శివ నిర్వాణ అంటే డైరెక్టర్లను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube