అర్ధరాత్రి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలు..!!

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సీరియస్ అవుతూ అర్ధరాత్రి నుండి స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు నిరసనలు తెలుపుతున్నారు.జాతీయ రహదారి కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి మానవహారం తో రహదారిని నిర్బంధించారు.

 Visakhapatnam Steel Plant Workers Protest From Midnigh Vizag Steel Plant,  Nirma-TeluguStop.com

పార్లమెంటులో అధికార పార్టీకి చెందిన ఎంపీలు స్టీల్ ప్లాంట్ విషయంలో వేసిన ప్రశ్నలకు నిర్మలాసీతారామన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, 100% ప్రైవేటీకరణ చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన ప్రతులను స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దహనం చేశారు.కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్ధరాత్రి నుండి విశాఖలో కార్మిక సంఘాలు రోడ్డున పడి నిరసనను తెలుపుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

Telugu Vizag Steel, Ysrcp-Telugu Political News

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి చేసిన కామెంట్లు ప్రతిపక్షాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విషయంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంది అని బిజెపి పార్టీ మిత్రపక్షం జనసేన ఆరోపిస్తున్న తరుణంలో నిర్మల సీతారామన్ చేసిన కామెంట్లు చెక్ పెట్టినట్లు అయింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నిర్ణయం పూర్తిగా కేంద్రానిదే అని తెలపటంతో అధికార పార్టీ వైసీపీ కి సంబంధం లేదు అన్నట్టు అయ్యింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube