కాళ్లు, చేతులు నరికేస్తాం..! బహిరంగ శిక్షలు అమలుచేస్తున్న తాలిబాన్ నేతలు

ఆఫ్గానిస్థాన్ లో  దయనీయమైన పరిస్థితి నెలకొన్నాయి.ఆకలితో అలమటిస్తున్న ఆఫ్గాన్ పౌరులను తాలిబాన్లు పట్టించుకోవడం లేదు.

దీనికి తోడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు.గతంలో చేపట్టిన పాలన తరహాలోనే తాజా పాలన ఉంటుందని స్పష్టం చేశారు.1990లో నిబంధించిన విధానాలే ఇప్పుడు అమలు అవుతాయని తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా నూరుద్దీన్ వివరించారు.గత పాలన మాదిరిగానే కాళ్లు, చేతులు నరకడం లాంటి శిక్షలు అమల్లోనే ఉంటాయన్నారు.

ఒకప్పటి క్రూరమైన విధానాలే ఇప్పుడు ఉంటాయని స్పష్టం చేశారు.గతంలో ఎవరైనా నేరానికి పాల్పడితే.

బహిరంగంగా శిక్షించే వాళ్ళమని ఇప్పుడు కూడా అదే విధమైన శిక్ష అమలు అవుతుందన్నారు.దీనిపై పలు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని ఇప్పుడు వాటిని పట్టించుకోమని వివరించాడు.

Advertisement

తమ దేశ చట్టాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ఏ దేశం కూడా ఈ విషయంలో తలదూర్చిద్దని తెలిపాడు.ఆయా దేశాల చట్టాలు, శిక్షలు గురించి మాట్లాడబోమని తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు.

ఖురాన్ ప్రకారం.చట్టాలు  రూపొందిస్తామన్నారు.ఖురాన్ కు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళిన కాళ్లు, చేతులు నరుకుతామని, అయితే గతంలో వీటిని బహిరంగంగా అమలు చేసే వాళ్ళమనీ ఇప్పుడు విషయంపై చర్చించుకుంటూన్నిమని తెలిపారు.

తాలిబన్ల గత ప్రభుత్వంలో తురాబీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు.గతంలో ఆఫ్గాన్ లో హంతకులను బహిరంగంగా కాల్చేవారు, దొంగలకు కాళ్లు చేతులు నరికేవారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు