అమెరికా లోని టెక్సాస్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.టేకాఫ్ సమయంలో రన్ వే పై హ్యాంగర్ ని ఢీకొనడం తో ఈ ఘటన చోటుచేసుకుంది.
రెండు ఇంజన్లు కలిగిన ఒక చిన్నపాటి ప్రయివేట్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్ ను ఢీ కొనడం తో విమానం కాలి బూడిదైంది.

అయితే ఈ ప్రమాదంలో ఆ విమానం లో ఉన్న పదిమంది సజీవ దహనమైనట్లు తెలుస్తుంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.అప్పటికే విమానం ఆ మంటలకు కాలిబూడిదైపోయింది.
దీనితో ఆ విమానం లో ఉన్న పది మంది కూడా అగ్నికి ఆహుతి అయిపోయారు.

అయితే అసలు టేకాఫ్ అవుతున్న సమయంలో హ్యాంగర్ కు విమానం ఎలా, ఎందుకు ఢీ కొట్టింది అన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అసలు ఆ ప్రయివేట్ విమానం ఎవరిది, దానిలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు వంటి పలు వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్న దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.







