మాటల మాంత్రికుడు, రాజకీయ మేథావి, అపర చాణక్యుడు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిశోర్‌కు మధ్య జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్ఛణీయాంశంగా మారింది.ఆయనకు కేసీఆర్ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారన్న వార్త అన్ని చోట్ల చక్కర్లు కొడుతోంది.
చివరకు నేషనల్ మీడియా వరకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.గులాబి బాస్ కేసీఆర్ అనుభవం, వ్యూహాల ముందు ప్రశాంత్ కిశోర్ ఎంత అనే సందేహం కలుగకమానదు.
దీంతో అధికార పార్టీ నేతుల కిశోర్ సేవలు తమకు అవసరం లేదంటూ తేల్చి చెబుతున్నారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టని కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రధాని మోడీని టార్గెట్ చేసి చీల్చిచెండాడుతున్న విషయం తెలిసిందే.
మోడీని వ్యతిరేకించే పార్టీలతో జతకూడా కడుతున్న పరిస్థితి.వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా జాతీయస్థాయిలో కేసీఆర్‌ను నిలబెట్టేందుకు ప్రశాంత్ కిశోర్‌ను కేసీఆర్ ఎంచుకున్నరని సమాచారం.ఎందుకంటే … ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్‌కు మంచి పట్టుంది.
అంతే స్థాయిలో ఫాలోవర్లు కూడా ఉన్నారు.ఆయన ద్వారా పని సులువవుతుందని భావించిన కేసీఆర్ ఆయనకు డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకున్నారనే సమాచారం చక్కర్లు కొడుతోంది.
కాగా జాతీయస్థాయిలో కేసీఆర్‌ను హైలెట్ చేసేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాసక్తత తెలిపినట్టు తెలిసింది.తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయని, జాతీయస్థాయిలో అది సరిపోదని, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి మద్దతు పలకాలని, దీంతో జాతీయస్థాయిలో ఫోకస్ అవుతారని సలహా ఇచ్చినట్టు తెలిసింది.దీనిని సీఎం కేసీఆర్ వ్యతిరేకించడమే కాకుండా మండిపడినట్టు సమాచారం.సలహాలు ఇవ్వమని కోరితే వేరే పార్టీకి మద్దతు తెలపమని హితవు పలకడం సరికాదు అన, అలాంటి సలహాలు తనకొద్దంటూ వ్యతేకత కనబరిచినట్టు తెలిసింది.
భవిష్యత్‌లో ఈ తతంతగం దేనికి దారి తీస్తందో చూడాల్సిందే.