'మా' ఆధ్వర్యంలో AIG హాస్పిటల్ లో ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఆద్వర్యంలో ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్ జరిగింది.పలువురు నటీనటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

 ‘మా’ ఆధ్వర్యంలో Aig హాస్పిటల-TeluguStop.com

ఈ సందర్భంగా AIG హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ – ”మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు.సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారు.

డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు.మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు.మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము.మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం.సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు.

కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు.ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి, ‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకొవాలి.

మా సభ్యత్వం కు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము” అని చెప్పారు.

సీనియర్ నటులు నరేష్ మాట్లాడుతూ – ”మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయిన తరువాత ఫస్ట్ ప్రిపరెన్స్ హెల్త్ కి ఇవ్వడం సంతోషం గా వుంది.

సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు.ఆరోగ్యం వుంటే అవకాశాలు వస్తాయి.AIG హాస్పిటల్ వారు ‘మా’ కు ఇస్తున్న సహకారం మరువలేనిది.AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారు.

AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ జరుగుతోంది.

ఇప్పుడు వున్న మా టీమ్ ఫర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు” అని తెలిపారు.మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ – మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ పరంగా ఎంతో సహకారం అందిస్తున్న aig హాస్పిటల్ వారికి ధన్యవాదములు.

మంచు విష్ణు హెల్త్ కి వెల్ఫేర్ కి ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నారు” అని అన్నారు.

Telugu Aig, Nageswara Reddy, Maa, Manchu Vishnu, Senior Naresh, Shiva Balaji, To

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – ”విష్ణు నరేష్ లు నాకు ఫ్రెండ్స్.మూవీ ఆర్టిస్ట్స్అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వుంటారు.కరోనా టైం లో కూడా రిస్క్ చేసి సినిమాలు చేసారు.

మూవీ ఆర్టిస్ట్స్ లకు ప్రివెంట్ హెల్త్ చెకప్ చాలా అవసరం.వరల్డ్స్ బెస్ట్ 50హాస్పిటల్స్ లో ప్రివెంట్ హెల్త్ కోసం ఏమి చేస్తారో ఆ ఈక్విప్ మెంట్ ఈ హాస్పిటల్ లో వుంది.

మా హాస్పటల్లో ఆర్టిస్ట్ లకు హెల్త్ చెకప్ చేయడం ఆనందంగా ఉంది.ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేషనల్, ఇంటర్ నేషనల్ లెవెల్ లో మంచి పేరు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube