టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపుతున్నాడని ఆరోపించారు.
రెండు సభలలో పదకొండు మందిని బలిగొన్నాడని తెలిపారు.చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని పేర్కొన్నారు.
అది చాలదన్నట్లుగా తమ నేరాన్ని పోలీసులపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు బహిరంగ సభలకు ఇకపై అనుమతి ఇవ్వొద్దని తెలిపారు.
కాగా గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన చంద్రన్న కానుక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.