పుట్టగానే తండ్రి వదిలేసినా 10 జీపీఏతో సత్తా చాటిన కవల ఆడపిల్లలు.. గ్రేట్ అంటూ?

తల్లీదండ్రుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంటే మాత్రమే పిల్లలు కెరీర్ పరంగా ఎదగడం సులువుగా సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే.తల్లి సపోర్ట్ ఉండి తండ్రి అండగా నిలబడకపోయినా పిల్లలు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

 Telangana Ssc Results 2023 Karimnagar Twin Sisters 10 Gpa Details, Telangana Ssc-TeluguStop.com

ఆడపిల్లలు అయితే ఈ కష్టం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే పుట్టగానే తండ్రి వదిలేసినా కవల ఆడపిల్లలు( Twin Sisters ) పది పరీక్షల ఫలితాలలో సత్తా చాటారు.

కరీంనగర్ జిల్లా( Karimnagar ) శంకరపట్నం మండలం కేశవపట్నంకు చెందిన కవిత పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్ సోర్సింగ్ లో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.16 సంవత్సరాల క్రితం కవిత డెలివరీ కోసం పుట్టింటికి వచ్చారు.కవల ఆడపిల్లలు పుట్టారని తెలిసిన కవిత భర్త కవిత, ఆమె పిల్లలను అత్తారింటికి తీసుకెళ్లలేదు.అప్పటినుంచి కవిత తన కూతుళ్లు శర్వాణి, ప్రజ్ఞానిలను ఎంతో కష్టపడి పోషించారు.

Telugu Gpa, Karimnagar, Karimnagartwin, Keshavapatnam, Mother Kavitha, Pragnani,

అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం సైతం శర్వాణి, ప్రజ్ఞానిలకు ఎలాంటి కష్టం రాకుండా పెంచారు.బుధవారం పదో తరగతి ఫలితాలు( Tenth Results ) విడుదల కాగా శర్వాణి, ప్రజ్ఞాని 10జీపీఏ సాధించి సత్తా చాటారు.విద్యార్థినులు ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ అమ్మమ్మ, తాతయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహం వల్లే మంచి ఫలితాలను సాధించామని తెలిపారు.శర్వాణి, ప్రజ్ఞానిలకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Telugu Gpa, Karimnagar, Karimnagartwin, Keshavapatnam, Mother Kavitha, Pragnani,

శర్వాణి, ప్రజ్ఞాని( Sharwani Pragnani ) రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మోడల్ స్కూల్ లో చదివి శర్వాణి, ప్రజ్ఞాని మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు.ఈ ఫలితాలను చూసి అయినా శర్వాణి, ప్రజ్ఞాని తండ్రిలో మార్పు రావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.తల్లీదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు సైతం ఉన్నత స్థానాలకు ఎదిగి లక్షల్లో ప్యాకేజీలు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube