వన్ వీక్‌లో స్కిన్ టోన్ పెరగాలా? అయితే ఈ రెమెడీ ట్రై చేయండి!
TeluguStop.com
ఏదైనా పెళ్లి లేదా ఫంక్షన్ వస్తోందంటే.ఎక్కడ్లేని కేరింగ్ అంతా చర్మంపైనే వచ్చేస్తుంది.
ముఖ్యంగా స్కిన్ టోన్‌ను పెంచుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.స్కిన్ వైటనింగ్ క్రీములు, రకరకాల ఫేస్ ప్యాకులు, మాస్కులు వాడుతుంటారు.
కొందరైతే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఏవేవో ఫేసియల్స్ చేయించు కుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే గనుక కేవలం వన్ వీక్‌లోనే స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.
పైగా ఈ రెమెడీ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక గుమ్మడి కాయను తీసుకుని పై తొక్క మరియు లోపల ఉన్న గింజలను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ గుమ్మడి ముక్కలను ఎండలో బాగా ఎండ బెట్టుకుని.మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి కాయ పొడి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్ని మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.