తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు.వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు.
శుక్రవారం హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి రాజమౌళి కూడా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.సినిమా తన మనసుకి దగ్గరగా ఉంటుందని ఈ సినిమాను వినాయక్ హిందీలో చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
హిందీలో ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందించాలని అన్నారు.సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు రాజమౌళితో ఇలా స్పెషల్ వీడియో చేయించినంత మాత్రాన హిందీ ఛత్రపతికి టికెట్లు తెగుతాయా అని కొందరు అంటున్నారు.
రాజమౌళి చెప్పాడని కాదు కానీ హిందీ ఛత్రపతి ట్రైలర్ అయితే మాస్ ఆడియన్స్ ని మెప్పించింది.సినిమా తప్పకుండా అక్కడ మాస్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందని అంటున్నారు.
ఓపెనింగ్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఛత్రపతి సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు.హిందె ఛత్రపతిని పెన్ స్టూడియోస్ నిర్మించారు.
దాదాపు శ్రీనివాస్ ని నమ్మి 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది.