ఉగ్రవాద కదలికలపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.ఈ కేసులో మొత్తం ఆరుగురు అరెస్ట్ అయ్యారని తెలిపారు.
పట్టుబడిన వారి నెట్ వర్క్ వివరాలు రాబడుతున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.
ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామన్న ఆయన ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.అయితే హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో భాగంగా నగరంలో ఆరుగురిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.







