సోషల్ మీడియా( Social Media )లో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించిన వీడియోలను కూడా మనం చూస్తుంటాం.
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో ఇతర ప్రాంతాలకు సంబందించిన వంటకాలను కూడా చూసే అవకాశం మనకు సోషల్ మీడియా కల్పిస్తోంది.ఈ నేపథ్యంలో కొందరు చెఫ్స్ తమ చేతివాటంలో రకరకాల రెసిపీస్ ట్రై చేసిన వీడియోలను మనం చూస్తూ వున్నాం.
ఈ క్రమంలో కొన్ని కాంబినేషన్ రెసిపీస్ నెటిజన్లకు మిక్కిలి చిరాకు కలిగిస్తూ ఉంటాయి.
తాజాగా, ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.మనలో చాలా మందికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ దోశ.అందుకే మనకు ఫుడ్ మార్కెట్లో ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి.అయితే మీరు ఎన్ని రకాల దోశలు ట్రై చేసినా మ్యాగీ దోశని ఎప్పుడూ ట్రై చేసి వుండరు.ఇక్కడ అలాంటి ప్రయోగాత్మక వీడియోను షేర్ చేశారు ఒక ఇన్స్టా ఖాతాదారుడు.
‘ది కుర్తా గై’ అనే ఖాతాదారుడు చేసిన వీడియో అత్యంత విశేషమైనది.దోశని ఇలా ఎందుకు చేస్తున్నాడో, ఇదేం టార్చర్‌రా బాబు అంటూ ఫన్నీగా చెప్పాడు.
ఇది అది చూసిన జనాలు కూడా మాకెందుకురా ఈ టార్చర్ అని అభిప్రాయ పడడం కొసమెరుపు.దోశ ప్రియులంతా ఆ మ్యాగీ దోశ ప్రయోగానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.దోశతో( Dosa ) ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడూ చేయొద్దు సామీ అంటూ.మరికొందరు కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.మ్యాగీతో దోశ చేయటానికి ముందుగా మాగీ( Maggie )ని గ్రైండ్ చేసి పిండిలా తయారు చేసుకున్నాడు.ఆ పిండితో పెనంపై దోశలా వేసుకుని ఎర్రగా కాల్చుకున్నాడు.
ఆ తర్వాత దాని పైన మ్యాగీ మసాలా కూడా వేసి బాగా వేయించాడు.ఇంకేముంది కట్ చేస్తే మ్యాగీ దోశ రెడీ.
ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా?