జూపల్లి, పొంగులేటి గెంటివేతపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం

తెలంగాణ లో వరుసగా మూడవ సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌( KCR ) ఉన్నారు.టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్ పార్టీగా మార్చిన తర్వాత రాబోతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు గాను కేసీఆర్‌ మరియు ఆయన టీమ్ చాలా గట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

 Brs Leaders Response About Ponguleti And Jupalli Details, Brs, Cm Kcr, Jupalli K-TeluguStop.com

అందులో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీ నుండి సాగనంపుతున్నారు.పార్టీ లో ఉంటూనే పార్టీకి నష్టం చేకూర్చే వారిపై కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే గత కొన్ని రోజులుగా నాన్చుతూ వస్తున్న జూపల్లి( Jupalli Krishna Rao ) మరియు పొంగులేటి శ్రీనివాస్( Ponguleti Srinivas ) లను తొలగించిన విషయం తెల్సిందే.ఈ ఇద్దరి తొలగింపు పై బీఆర్‌ఎస్ పార్టీ లో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కానీ మీడియా వర్గాల వారు మరియు రాజకీయ సర్కిల్స్ లో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన ఏ ఒక్కరు కూడా ఆ ఇద్దరి తొలగింపు పై స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు.అంతే కాకుండా వారిని తప్పించడం అనేది అన్యాయం అని కూడా ఏ ఒక్కరు మాట్లాడటం లేదు.పార్టీ అధినేత ఏం చేసినా కూడా పార్టీ గెలుపు కోసం అని వారు భావిస్తున్నారు.అందుకే ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని డెప్త్‌ గా తీసుకుని ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.

మొత్తానికి కేసీఆర్‌ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ముందుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.అలా చేస్తేనే మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని వారు కూడా భావిస్తున్నారట.పార్టీ అధినేత పై పూర్తి నమ్మకం ఉంచిన నాయకులు మరియు కార్యకర్తలు కేసీఆర్‌ నిర్ణయాలను తప్పుపట్టే పరిస్థితి ఆ పార్టీ లో లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించే క్రమంలో రాష్ట్రంలో ఇబ్బందిగా ఉన్న నాయకులను తొలగించడం మంచిదే అంటూ రాజకీయ పండితులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube