తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలతో చీకటి రాజకీయాలు చేస్తూ, లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు… నేను నిరూపిస్తా.నీకు సస్పెండ్ చేసే దమ్ముందా…ఆంధ్ర పప్పు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు.
నెల్లూరు నగరంలో అక్రమ అక్రమ లే అవుట్ లకు మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ బినామీగా వ్యవహరిస్తున్నారంటూ నారా లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను ఎప్పుడో ఆపి వేసిందని నారా లోకేష్ లోకజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.100 కోట్లు 200 కోట్లు దోచుకున్న అంటూ దుష్ప్రచారాన్ని చేసే నేతలు దమ్ముంటే నిరూపించాలన్నారు.రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుంది తప్ప సంపాదించుకుంది లేదని ఇందుకు కాణిపాకం వినాయకుడు పై ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.