బిగ్ బాస్ ద్వారా షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు.అదే విధంగా బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు పొందినవారు కూడా ఉన్నారు.
ఇకపోతే ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ షో 5 సీజన్ లను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ అంటూ వచ్చిన షో కూడా ముగిసిన విషయం తెలిసిందే.త్వరలోనే బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం కానుంది.
అయితే ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.మరి బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు ప్రారంభం కానుంది అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈసారి కూడా సెలబ్రెటీ కంటెస్టెంట్ లతో పాటుగా మై విలేజ్ షో నుంచి కూడా ఒకరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఇకపోతే బిగ్ బాస్ 6 సీజన్ ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు గతంలో పలు రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మళ్ళీ ఈ సెప్టెంబరుకు షిఫ్ట్ చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.కాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రస్తుతం ఆరవ సీజన్ కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఐదు సీజన్ ల కంటే మరింత ఎక్కువ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 6 సీజన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఇక సెప్టెంబర్ 4 వ తేదీన మొదటి ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉందట.ఇక మొదటి ఎపిసోడ్ లో చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే మై విలేజ్ షో నుంచి గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ఏ రేంజ్ లో క్రేజ్ ను అందుకున్న అందరికి తెలిసిందే.అయితే ఈసారి కూడా మై విలేజ్ షో నుంచి అనిల్ జీలా అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.