మెగా డాటర్ నిహారిక( Nihariaka ) గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చేశారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి మాత్రం మెగా కాంపౌండ్ ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు.
అయితే నిహారిక తన వ్యక్తిగత విషయం గురించి ఎక్కడ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు కానీ ఈమె తన వృత్తిపరమైన జీవితంలో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది.నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు సినిమాలు వెబ్ సిరీస్ నిర్మాణ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
![]()
తాజాగా నిహారిక డెడ్ పిక్సెల్ ( Dead Pixels ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ వెబ్ సిరీస్ తనకు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఈమె ఈ సక్సెస్ నుతన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోని నిహారిక తన స్నేహితులతో కలిసి గత కొద్ది రోజులుగా బాలీ( Bali ) దీవులలో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అక్కడ ప్రకృతిలో లీనమైనటువంటి ఒక ఫోటోని నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.
![]()
ఈ సందర్భంగా ఈమె ఈ ఫోటోని షేర్ చేస్తూ గత కొద్దిరోజులుగా తాను అనుభవించిన సంఘటనలను మాటలలో చెప్పలేనని ఈమె తెలియజేశారు.అయితే ప్రస్తుతం తాను అనుకున్న పనులన్నీ పూర్తి అవుతున్నాయని దీంతో తనకు చాలా సంతోషంగా ఉందని ఈమె తెలిపారు.ఇలా చిన్నచిన్న ఆనందాలే పెద్ద సంతోషాన్ని కలిగిస్తాయి అంటూ నిహారిక ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇక బాలి దీవుల గురించి మాట్లాడుతూ ఈ ప్రదేశం నన్ను నేను తిరిగి వెతుక్కోవడానికి ఎంతో కృషి చేసిందని, ఒక తల్లిలా గురువుగా ఈ ప్రదేశం ఎంతో ఉపయోగపడింది అంటూ ఈ సందర్భంగా బాలీ దీవులకు కూడా ఈమె కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






