న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై మేకపాటి విమర్శలు/h3p మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్( Anil Kumar ) పై  వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు.

నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేయవద్దంటూ అనిల్ కుమార్ ను హెచ్చరించారు.

H3 Class=subheader-style2.సోనియా పై బిజెపి ఎంపి అరవింద్ కామెంట్స్/h3p """/" / కాంగ్రెస్ కీలక నాయకురాలు సోనియాగాంధీపై నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి విమర్శలు చేశారు .

మా నాన్న ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యానికి గురైనప్పుడు సోనియాగాంధీ కనీసం ఫోన్ కూడా చేయలేదని విమర్శించారు.

H3 Class=subheader-style3.రాహుల్ గాంధీ భద్రతపై సమీక్ష/h3p కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సమీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది.

H3 Class=subheader-style4.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

మంగళవారం టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

H3 Class=subheader-style5.రజకులకు ఎస్సీ హోదా కల్పించాలి/h3p """/" / దేశంలోని 11 రాష్ట్రాల్లో రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని నేషనల్ ధోబి మహాసంగ్ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది.

H3 Class=subheader-style6.తెలంగాణలో టీడీపీ కి పునర్వైభవం/h3p తెలంగాణలో టిడిపికి పునర్ వైభవం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style7.ఆర్ ఆర్ ఆర్ సర్వే ను అడ్డుకున్న రైతులు/h3p """/" / అలైన్మెంట్ ను మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు.

H3 Class=subheader-style8.ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ కు హై కోర్టు సమన్లు/h3p పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరే , సంజయ్ రౌత్ లకు ఢిల్లీ హై కోర్టు సమన్లు జారీ చేసింది.

H3 Class=subheader-style9.పాన్ ఆధార్ లింక్ గడువు పెంపు/h3p """/" / కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ ను పొడిగించింది.

జూన్ 30 వరకు అవకాశం కల్పించింది.h3 Class=subheader-style10.

ఒంటి పూట బడులపై టిడిపి ప్రశ్న/h3p ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు జగన్ అని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

H3 Class=subheader-style11.ఆర్ఆర్ఆర్ టీం కు చిరంజీవి సన్మానం/h3p """/" / ఆర్ఆర్ ఆర్ టీం కు మెగాస్టార్ చిరంజీవి సన్మానం నిర్వహించారు.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి జరిగిన స్పెషల్ పార్టీలో చిత్ర యూనిట్ ను చిరంజీవి సన్మానించారు.

H3 Class=subheader-style12.కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు/h3p తాను ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నానని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

H3 Class=subheader-style13.హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ జారీ/h3p """/" / తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణం శాఖ హెచ్చరించింది .

ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్ లో ఎల్లో  అలెర్ట్ జారీ చేసింది.

H3 Class=subheader-style14.నిమ్స్ కు ఎర్ర మంజిల్ స్థలం/h3p పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తాన్ని నిమ్స్ కు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

H3 Class=subheader-style15.ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా : రాహుల్/h3p అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తానని ప్రకటించారు.

H3 Class=subheader-style16.ఢిల్లీకి ఏపీ సీఎం జగన్/h3p """/" / ఏపీ సీఎం జగన్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు.

H3 Class=subheader-style17.కిషన్ రెడ్డి కామెంట్స్/h3p మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీకి వెళ్లి మహిళా రిజర్వేషన్ బిల్లు పై పోరాటం ఏమిటని , మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

H3 Class=subheader-style18.గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో/h3p గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.h3 Class=subheader-style19.

టిడిపి జనసేన తో కలిసి పోటీ చేస్తాం/h3p """/" / రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సిపిఐ ఎన్నికలకు వెళ్తుందని, ముఖ్యంగా జనసేన,  టిడిపి పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,500 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59,450 .

మరోసారి సీనియర్ కొరియోగ్రాఫర్లకే అవకాశం ఇస్తున్న చిరంజీవి…