తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గ టికెట్ ఆశించి పటేల్ ప్రభాకర్ రెడ్డి భంగపడ్డారు.టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారని తెలుస్తోంది.
అదేవిధంగా గద్వాల టికెట్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.







