ఎదురుచూపులు ఫలించి కెనడాలో( Canada ) శాశ్వత నివాస హోదా పొందిన ఆనందం క్షణాల వ్యవధిలో ఆవిరైంది.ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే ఓ భారతీయ యువకుడిని మృత్యువు కబళించింది.
వివరాల్లోకి వెళితే.పంజాబ్ రాష్ట్రం తాండా ఉర్మూర్ సమీపంలోని సిక్రి గ్రామానికి చెందిన ఆకాశ్ దీప్( Akash Deep ) (27) ఐదేళ్ల క్రితం స్టడీ వీసాపై కెనడా వెళ్లాడు.
పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్( Permanent Residency Status ) (పీఆర్) పొందాలన్నది అతని కల.ఈ క్రమంలో నిరీక్షణ ఫలించి పీఆర్ పొందాడు.దీంతో ఈ సంతోషాన్ని మిత్రులతో కలిసి పంచుకునేందుకు గాను ఆకాశ్ తన స్నేహితులతో కలిసి అంటారియోలోని పోర్ట్ పెర్రీ సరస్సు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించాడు.రెండు రోజుల ఆపరేషన్ తర్వాత ఆకాశ్ మృతదేహాన్ని సరస్సు నుంచి వెలికి తీశారు పోలీసులు.
ఇకపోతే.ఈ ఏడాది జూన్‌లో కెనడాలో అదృశ్యమైన భారతీయ విద్యార్ధి కథ విషాదాంతమైంది.అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.పశ్చిమ మానిటోబోలోని ఓ నగరం నుంచి విషయ్ పటేల్ ( Vishay Patel )అదృశ్యమయ్యారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో బ్రాండన్ నగరానికి తూర్పున వున్న అస్సినిబోయిన్ నది, హైవే 110 వంతెనకు సమీపంలో పటేల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

బాధితుడు జూన్ 16న ఉదయం తప్పిపోయినట్లు బంధువులు తెలిపారు.గ్రే కలర్ 2012 మోడల్ హోండా సివిక్‌లో తన ఇంటి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించినట్లు ది బ్రాండన్ సన్ ( The Brandon Sun )నివేదించింది.పటేల్ అదృశ్యమైన అదే రోజు సాయంత్రం స్థానిక హోమ్ డిపో పార్కింగ్ స్థలంలో సివిక్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రివర్ బ్యాంక్ డిస్కవరీ సెంటర్ గ్రౌండ్స్ వైపు పటేల్ నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశామని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు.

దీంతో జూన్ 17న మధ్యాహ్నం నాటికి బ్రాండన్ పోలీస్ సర్వీస్ (బీపీఎస్) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో జూన్ 18 (ఆదివారం) సాయంత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఆ ప్రాంతంలో జరిపిన శోధన ఫలితంగా తప్పిపోయిన పటేల్ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.గుజరాత్‌కు చెందిన పటేల్ గత రెండేళ్లుగా అస్సినిబోయిన్ కమ్యూనిటీ కాలేజ్‌లో చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.







