వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఘన విజయం..!!

బెంగళూరులో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్( Pak vs NZ ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్( Pakistan ) బౌలింగ్ ఎంచుకోవడంతో.

 Pakistan Big Victory Over New Zealand In The World Cup Tournament Details, Paki-TeluguStop.com

మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్( New Zealand ) పాక్ నీ ఊచకోత కోసింది.న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేయడం జరిగింది.

కివీస్ ఆటగాళ్లు రచిన్ 108, విలియంసన్ 95, ఫిలిప్స్ 41, చాప్ మాన్ 39.పరుగులు చేయడం జరిగింది.అనంతరం 402 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ బ్యాట్స్ మ్యాన్ లు మొదటి నుండి దూకుడుగా ఆడటం జరిగింది.అయితే మధ్యలో వర్షం కొన్నిసార్లు పడటంతో అంపైర్లు ఓవర్లను కుదించారు.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం 41 ఓవర్ లలో 342 పరుగులను టార్గెట్ గా నిర్ణయించారు.

అయినా పలుమార్లు వర్షం పడుతూ ఉండటంతో ఆటకు అంతరాయం కల్పించడంతో స్కోర్ బోర్డు బట్టి డక్ వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను అంపైర్లు విజేతగా ప్రకటించారు.ముందుగా కివీస్ 401 పరుగులు చేయగా.రెండో బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ 25.3 ఓవర్లలో 200 పరుగులు చేయడం జరిగింది.పాకిస్తాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ ( Fakhar Zaman ) విధ్వంసం సృష్టించాడు.63 బంతులలో 6 ఫోర్,లు 9 సిక్స్ లు కొట్టి 100 పరుగులు చేయడం జరిగింది.దీంతో పాకిస్తాన్ తరపున వరల్డ్ కప్ లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా ఫకర్ రికార్డు నెలకొల్పటం జరిగింది.

కాగా న్యూజిలాండ్ ఓటమితో సౌతాఫ్రికా సెమీస్ లోకి దూసుకెళ్లిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube