టీడీపీ నేతలను సీఎం చేయడానికి జనసేన పార్టీ లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.కానీ మన బలం ఎంత ఉందో బేరీజు వేసుకోవాలని తెలిపారు.
త్రిముఖ పోటీలో జనసేన బలికావడానికి సిద్దంగా లేదని పవన్ చెప్పారు.డిసెంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీనే తమ ప్రత్యర్థి అని తెలిపారు.
గౌరవానికి భంగం కలగకుండా అన్నీ పద్ధతిగా జరిగితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పేర్కొన్నారు.ఎన్నికలు అయ్యాక ఫలితాలను బట్టి సీఎం గురించి మాట్లాడదామని చెప్పారు.
పొత్తుల అంశాన్ని తక్కువ అంచనా వేయొద్దన్న జనసేనాని సీఎం అభ్యర్థిగదా ఉంటేనే పొత్తు అని మాట్లాడకూడదని వెల్లడించారు.అలయెన్స్ పార్టీ పెరుగుదలకు దోహదం చేస్తుందని అన్నారు.
పాలిటిక్స్ లో వ్యూహాలు మాత్రమే ఉంటాయన్నారు.అయితే ఈ జూన్ నుంచి ప్రజల్లో తిరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.







