ఐతే ఆ బాలీవుడ్‌ సినిమాలో చైతూది చిన్న రోల్‌ ఏమీ కాదా?

అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్‌ స్టోరీ విడుదలకు సిద్దంగా ఉంది.

 Naga Chaitanya In Ameer Khan Movie Laal Sing Chadda,latest Tollywood News-TeluguStop.com

ఇప్పటికే సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేశారు.సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న కారణంగా సినిమాకు విపరీతమైన బజ్ ఉంది.

ఇదే సమయంలో హీరోగా థ్యాంక్యూ అనే సినిమాను కూడా చేశాడు.విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కూడా విడుదలకు సిద్దం చేస్తున్నారు.

ఇక గత కొన్ని రోజులుగా నాగచైతన్య బాలీవుడ్‌ మూవీ లాల్‌ సింగ్‌ చద్దా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.అమీన్ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఆర్మీ ఆఫీసర్ గా నాగ చైతన్య నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చింది.

Telugu Ameer Khan, Laal Chaddha, Naga Chaitanya, Telugu-Movie

మొన్నటి వరకు ఈ సినిమాలో చైతూ పాత్ర చాలా తక్కువ ఉంటుందని అయిదు నుండి పది నిమిషాలు ఉండటమే చాలా పెద్ద విషయం అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి.ఇలాంటి సమయంలో నాగచైతన్య మరియు అమీర్‌ ఖాన్ ల కాంబోలో సినిమాలు దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతున్నాయి.నెల రోజుల పాటు చైతూ పై లాల్‌ సింగ్‌ చద్దా యూనిట్‌ సభ్యులు సినిమాను తెరకెక్కించారు అంటూ ఖచ్చితంగా సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.చిన్న చితకా పాత్ర అయితే ఇన్ని రోజుల షూటింగ్‌ ఉండేది కాదు.

కాని బాలీవుడ్‌ లో చైతూ ఎంట్రీ అనేది చాలా రిచ్ గా గ్రాండ్‌ గా ఏదో చిన్న గెస్ట్ గా కనిపించి కనిపించని గెస్ట్‌ పాత్రలో కాకుండా మంచి సాలిడ్‌ పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇన్నాళ్ల షూటింగ్‌ తో చైతూది ఆ సినిమాలో చిన్న రోల్‌ కాదని క్లారిటీ వచ్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube